Nipah Virus: కేరళలో మళ్లీ నిపా కలకలం
2018లో నిపా వైరస్ కేరళను (kerala) వణికించిన సంగతి తెలిసిందే. ఎంతో మందిని బలితీసుకున్న తర్వాత మళ్లీ 2021లో ఈ వైరస్ (nipah virus) దాడి చేసింది. అప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి బతికి బయటపడ్డారు. ఆ తర్వాత మళ్లీ ఈ కేసులు కనిపించకపోయేసరికి నిపా పీడ వదిలింది అనుకున్నారు. కానీ ఈ నిపా వైరస్ పోలేదు. ఇటీవల కేరళలో రెండు అసహజ మరణాలు సంభవించడంతో అవి నిపా వైరస్ వల్లే అని ప్రభుత్వం సందేహిస్తోంది. రాకపోకలపై నిబంధనలు విధించారు. అందరికీ టెస్టులు తప్పనిసరి చేసారు. కేరళలో మొదటి నిపా కేసును 2018 మే 19న గుర్తించారు. (nipah virus)