పరీక్ష రాస్తుండగా కూలిన భవనం.. 22 మంది విద్యార్థులు దుర్మరణం
Nigeria: నైజీరియాలో ఘోరం చోటుచేసుకుంది. విద్యార్థులు పరీక్ష రాస్తుండగా స్కూల్ భవనం కూలిపోవడంతో 22 మంది మృత్యువాతపడ్డారు. ప్లాటో రాష్ట్రంలోని జోస్ నార్త్ జిల్లాలో ఉన్న సెయింట్ ఎకాడెమీ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా.. ఉన్నట్టుండి భవనం కూలిపోయింది. ఈ ఘటనలో 22 మంది పిల్లలు చనిపోగా.. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారిని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.
నైజీరియాలోని చాలా మటుకు భవనాలు నాసిరకంగానే ఉంటాయి. స్థానిక నాయకులు, అధికారులు భవన నిర్మాణాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా నాసిరకం మెటీరియల్స్ వాడి నిర్మాణాలు చేపడుతుంటారు. అందుకే నైజీరియాలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి.