NIA Raids In Hyderabad: హైద‌రాబాద్‌లో స‌డెన్ త‌నిఖీలు

NIA Raids In Hyderabad: తెలంగాణ రాజధాని హైద‌రాబాద్‌లో స‌డెన్ నేష‌న‌ల్ ఇన్‌వెస్టిగేష‌న్ టీం త‌నిఖీలు చేప‌ట్టింది. మావోయిస్టుల‌తో లింకులు ఉన్న కొంద‌రు వ్య‌క్తులు హైద‌రాబాద్‌లో తిరుగుతున్న‌ట్లు స‌మాచారం రావ‌డంతో ఉద‌యాన్నే త‌నిఖీలు మొద‌లుపెట్టారు. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్, వ్యేధం మ్యాగ‌జైన్ ఎడిట‌ర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో కూడా త‌నిఖీలు జ‌రిగాయి. వివిధ పాత్రికేయ సంస్థలు మావోయిస్టుల‌తో క‌లిసి వారికి సాయం చేస్తున్నార‌ని NIA ఆరోపిస్తోంది. జ‌ర్న‌లిజం చేస్తూనే మావోల‌కు సాయం చేస్తున్నార‌ని ఆంటోంది.