New York: కలల నగరం.. పీడకలగా మారుతోంది
న్యూయార్క్ (new york) నగరం.. కలల నగరంగా అభివర్ణిస్తారు. ఏటా ఎందరో విదేశీయులు ఇక్కడ తమ కలల ప్రపంచాన్ని నిర్మించుకుని కొత్త జీవితాన్ని గడపాలని అనుకుంటారు. కానీ ఇప్పుడు న్యూయార్క్ కలల నగరం కాదు.. పీడకలల నగరంగా మారుతోంది. ఇందుకు కారణం అక్కడ ఎక్కువ అవుతున్న వలసదారులే.
గతేడాది న్యూయార్క్‌కు వచ్చిన వలసదారుల సంఖ్య 18,000. వారిలో దాదాపు 80,000 మందికి ఉండటానికి ఇళ్లు లేవు. దాంతో వారిని హోటల్స్, జిమ్‌లలో ఉండమని అక్కడి మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఆదేశాలు జారీ చేసారు. దీని వల్ల అక్కడి ప్రభుత్వానికి మూడేళ్లలో దాదాపు 12 బిలియన్ డాలర్లు ఖర్చు అయ్యింది. ఇప్పుడు వీరిని నగరంలో ఉండనివ్వాలంటే అంత సులువు కాదు. ఎందుకంటే వీరికి ఉద్యోగాలు దొరకవు. లీగల్‌గా పని చేయాలన్నా అనుమతులు రావడానికి చాలా సమయం పడుతుంది. (new york)
దాంతో బతుకుతెరువు కోసం సరైన పేపర్ వర్క్ లేకుండానే ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. దీని వల్ల వారికే సమస్య. ఈ విషయంలో అధ్యక్షుడు జో బైడెన్ (joe biden) ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని వలసదారులకు ఎలాంటి సాయం చేయడంలేదని మేయర్ ఎరిక్ మండిపడుతున్నారు. ఇది నేషనల్ ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అంశం. కానీ వారు ఫెడరల్ ప్రభుత్వం చూసుకుంటుందిలే అని వదిలేస్తున్నారని ఎరిక్ ఆరోపిస్తున్నారు.