Bengaluru: ఓనర్‌కి కనిపించేలా కొత్త దంపతుల సెక్స్.. ఫిర్యాదు చేసిన మహిళ
Bengaluru: ఓ నూతన జంట తమ ఇంట్లోని గదిలో శృంగారం చేసుకుంటుండగా అది చూసిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. అవళహళ్లి ప్రాంతంలోని గిరినగర్ ప్రాంతంలో ఉంటున్న ఓ జంటకు ఇటీవల పెళ్లయ్యింది. వీరిద్దరూ గిరినగర్‌లోని ఓ ఫ్లాట్‌ను రెంట్‌కి తీసుకుని ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఆ జంట శృంగార చర్యలో ఉండగా.. ఆ ఫ్లాట్ ఓనర్ తన కిటికీ నుంచి చూసింది. ఇలా మరీ అందరూ చూసేలా ప్రైవేట్ పనులు చేయడం సమంజసం కాదని ఆమె వారిని వారించింది. దాంతో వారు కూడా తమ ప్రైవేట్ అంశాల్లో ఎందుకు కలగజేసుకుంటున్నారని గొడవపడ్డారు. అలా ఈ పంచాయతీ పోలీసుల దాకా చేరింది. వారిని ఫ్లాట్ ఖాళీ చేయించాలని పోలీసులను కోరింది. ఇరు వైపు నుంచి కేసు రాసుకున్న పోలీసులు కోర్టులో తేల్చుకోవాలని చెప్పి పంపించారు.