మృగంలా మారిన మేనల్లుడు..అత్త అత్త అంటూనే
Viral News: ఉద్యోగ రిత్యా వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి రావడంతో తన భార్యను ఒంటరిగా వేరే ఇంట్లో పెట్టలేక బంధువులకు అప్పగించి వెళ్లాడు ఓ భర్త. పాపం అతనికేం తెలుసు.. సొంతింట్లోనే రాక్షసుడు ఉన్నాడని. తన భార్యా పిల్లలు బంధువుల ఇంట్లో సంతోషంగా ఉన్నారని భ్రమపడుతూ తన ఉద్యోగం తాను చేసుకుంటున్నాడు. ఇంతలో ఆయనకు ఊహించని షాక్ తగిలింది. సొంత మేనల్లుడే తన భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఈ దారుణ ఘటన ఝార్ఖండ్లో చోటుచేసుకుంది. బొకారే ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు తన మేనత్తపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి భర్తకు గోవాలో ఉద్యోగం రావడంతో తన భార్య, పిల్లలను తన చెల్లెలి ఇంట్లో వదిలి వెళ్లాడు. అత్త అత్త అంటూ మంచివాడిగా నటిస్తూ.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా ఈ విషయం ఎవరితోనైనా చెప్తే పిల్లల్ని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
దాంతో ఆమె వెంటనే ఎవ్వరికీ ఫిర్యాదు చేయలేదు. అయితే.. ఇలాగే ఉంటే రేపు తన పిల్లలకు ఏదైనా జరగచ్చని భావించి స్థానిక పంచాయతీ పెద్దలతో తన బాధను చెప్పుకుంది. అయితే వారు న్యాయం చేయలేదు. భర్త రానంత వరకు ఎలాంటి తీర్పు ఇవ్వలేం అన్నారు. దాంతో వెంటనే తన పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మొన్న రాఖీ సందర్భంగా తన భర్త ఇంటికి రావడంతో జరిగినదంతా చెప్పేసింది. దాంతో భార్యను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసారు. వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.