Navdeep: అరెస్ట్ చేయొద్దు అంటూ హై కోర్టు ఆదేశం

డ్ర‌గ్స్ కేసులో (drugs case) ప‌ట్టుబ‌డ్డ న‌టుడు న‌వ‌దీప్ (navdeep) తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ వేసారు. త‌న‌కు డ్ర‌గ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేద‌ని పేర్కొన్నాడు. వాదోప‌వాదాలు విన్నాక హైకోర్టు న‌వ‌దీప్‌ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. డ్ర‌గ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో న‌వ‌దీప్‌ను 28వ నిందితుడిగా చేర్చారు. ప్ర‌స్తుతం న‌వ‌దీప్ ప‌రారీలో ఉన్నార‌ని తెలుస్తోంది. న‌వ‌దీప్‌కు విదేశాల‌కు చెందిన డ్ర‌గ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయ‌ని పోలీసులు అంటున్నారు. (navdeep)