Navdeep: నార్కోటిక్ పోలీసుల ముందు హాజరు
మాదాపూర్ డ్రగ్స్ కేసులో తెలంగాణ హైకోర్టు టాలీవుడ్ నటుడు నవదీప్‌కు (navdeep) నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆయన నార్కోటిక్స్ పోటీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ డ్రగ్స్ కేసులో నవదీప్‌ను కూడా హైదరాబాద్ పోలీసులు నిందితుడిగా చేర్చారు. కానీ నవదీప్ మాత్రం అది తను కాదని తనకు ఈ కేసుకు ఏ సంబంధం లేదని చెప్తూ వచ్చారు. నవదీప్ తనంతట తాను విచారణకు రాకపోతే అరెస్ట్ చేయక తప్పదని పోలీసులు హెచ్చరించడంతో ఆయన ఈరోజు హాజరయ్యారు.