Nanded Hospital: 31 మంది మృతి.. 71 మందికి సీరియస్
మహారాష్ట్రలోని నాందేడ్‌లో (nanded hospital) ఉన్న శంకరరావు చావన్ ప్రభుత్వ హాస్పిటల్‌లో మృతుల సంఖ్య పెరుగూ వస్తోంది. ఇప్పటివరకు 31 మంది మృతిచెందగా అందులో 16 మంది పసికందులు ఉన్నారు. ఇంకా 71 మంది పేషెంట్లకు సీరియస్‌గా ఉంది. హాస్పిటల్‌లో మందుల స్టాక్ అయిపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని ఆరోపిస్తున్నారు. మరోపక్క హాస్పిటల్ డీన్ శ్యాంరావు వకోడే మాట్లాడుతూ.. మందుల స్టాక్ అయిపోవడంతో వారు చనిపోవారు అన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తున్నప్పటికీ వారు స్పందించకపోవడంతోనే చనిపోయారని అంటున్నారు. మందుల స్టాక్ లేనప్పుడు వైద్యులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నప్పుడు ఇంత మంది ఎలా చనిపోయారు అనేదానిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసి రెండు రోజుల్లో నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.