Hindupuram: బాలిక‌ను గ‌ర్భిణిని చేసిన బాల‌య్య అభిమాని

nandamuri balakrishna fan impregnates a minor

Hindupuram: తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ నియోజ‌క‌వర్గం అయిన హిందూపురంలో ఘోరం చోటుచేసుకుంది. బాల‌య్య అభిమానిగా చెప్పుకునే ఓ నీచుడు మైన‌ర్‌పై రేప్ చేసి గ‌ర్భం దాల్చేలా చేసాడు. బాల‌య్య అభిమాని, తెలుగు దేశం పార్టీ నాయకుడైన‌ రాజేష్ ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకొని గర్భవతిని చేసాడు. ఇటీవల అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సతీష్ హత్య కేసులో ఆల్రెడీ రాజేష్‌ రిమాండ్ ఖైదీగా కొంత‌కాలం పాటు జైలులో ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో అత‌ను ఓ బాలిక‌కు ప్రేమిస్తున్నానంటూ మాయ‌మాట‌లు చెప్పి లొంగ‌దీసుకున్నాడు. రెండు రోజుల క్రితం కడుపు నొప్పితో బాలిక‌ ఆసుపత్రిలో చేర‌గా గ‌ర్భం దాల్చిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. రాజేష్‌పై పోక్సో చట్టం కింద కేసు పోలీసులు కేసు న‌మోదు చేసారు.