Jeans: జీన్స్ ప్యాంట్ వెనుక ఆ చిన్న జేబులు ఎందుకుంటాయ్‌?

mystery behind small pockets behind jeans revealed

Jeans: జీన్స్ ప్యాంట్ వెనుక సాధార‌ణ జేబు కాకుండా దానిపైనే మ‌రో చిన్న జేబుని గ‌మ‌నించే ఉంటారు. అది ఎందుకు ఉంటుందో తెలుసా? అస‌లు దాని వెనకున్న మిస్ట‌రీ ఏంటి? ఆ చిన్న జేబు గురించి తెలుసుకునే ముందు అస‌లు ఈ జీన్స్‌ని ఎవ‌రు ఎలా క‌నిపెట్టారో తెలుసుకుందాం.

ఈ జీన్స్‌ను 1873లో మే 20న‌ జ‌ర్మ‌న్ అమెరిక‌న్ అయిన లెవీ స్ట్రాస్ అనే వ్యాపార‌వేత్త క‌నిపెట్టారు. మైనింగ్ ప‌నులు చేసేవారి కోస‌మ‌ని ముందు ఈ జీన్స్ ప్యాంట్ల‌ను త‌యారుచేయ‌డం మొద‌లుపెట్టారు. ఆ చిన్న జేబును వాచీల‌ను జాగ్ర‌త్త‌గా పెట్టుకోవ‌డం కోసం డిజైన్ చేసార‌ట‌. ఆ త‌ర్వాత అగ్గిపెట్టెలు, నాణేలు వంటి చిన్న చిన్న వ‌స్తువుల‌ను పెట్టుకునేందుకు ఉపయోగించేవారు. అలా మార్కెట్‌లోకి వ‌చ్చిన ఈ జీన్స్ 1920 నాటికి లివైస్ డెనిమ్ ప్యాంట్ల కొనుగోలు టాప్ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ప్ర‌పంచవ్యాప్తంగా ఈ జీన్స్‌కు ఉన్న క్రేజే వేరు.

అలా కేవ‌లం మైనింగ్‌లో పనిచేసే వారి కోసం డిజైన్ చేయ‌బడిన జీన్స్ ఇప్పుడు అన్ని వ‌య‌సుల వారూ వేసుకునేంత‌గా పాపుల‌ర్ అయ్యాయి. అయితే ఆ చిన్న జేబులు మైనింగ్‌లో ప‌నిచేసేవారి కోసం డిజైన్ చేసారు. ఇప్పుడు అవి ఎందుకున్నాయో చాలా మందికి తెలీకుండాపోయింది. దాంతో దానిని వాడ‌ట‌మే మానేసారు.