నా గర్ల్‌ఫ్రెండ్ పచ్చి మాంసం తింటానంటోంది..!
ఈ మధ్యకాలంలో వింత వింత పేర్లతో కొత్త డైట్లు పుట్టుకొస్తున్నాయి. కీటో అని వీగన్ అని ఇలా ఎన్నో రకాల డైట్లు ఫాలో అవుతున్నారు నేటి యువత. అయితే ఓ అబ్బాయికి మాత్రం వింత సమస్య ఎదురైంది. ఆ అబ్బాయి గర్ల్‌ఫ్రెండ్ (girlfriend) కార్నివోర్ డైట్ ఫాలో అవుతా అంటోందట. అంటే రోజంతా కేవలం పచ్చి మాంసం తినడం. వింటుంటేనే వాంతులు అయ్యేలా ఉన్నాయి కదూ..! మనకే ఇలా ఉందంటే.. ఇక ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అతను పేర్లు వివరించకుండా తన బాధను సోషల్‌మీడియాలో షేర్ చేసుకున్నాడు. అతను తన ప్రేయసితో లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నాడు.
వీరిద్దరూ కలిసి చక్కగా డైట్స్ ఫాలో అవుతారు వర్కవుట్స్ చేస్తుంటారు. అయితే కొన్ని నెలలుగా తన గర్ల్‌ఫ్రెండ్ వింతగా ప్రవర్తిస్తోందట. ఏం వండినా కూడా సరిగ్గా తినడంలేదు. కారణం ఏంటని అడిగితే.. తాను కేవలం కార్నివోర్ డైట్ చేస్తానని పచ్చి మాంసం తప్ప ఇంకేమీ తిననని చెప్పేసింది. ఇదెక్కడి అలవాటురా బాబు అని ఆ అమ్మాయికి ఎంతో నచ్చజెప్పాలని చూసాడు. అయినా తను వినలేదు. ఇటీవల తనకు తెలీకుండా వేరే ప్రదేశానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందట. ఎక్కడికి అని అడిగితే.. ఆ ప్రదేశంలో కార్నివోర్ డైట్ గురించి అన్నీ తెలిసిన డైటీషియన్ ఉందని ఆమెను అడిగి అన్ని వివరాలు స్వయంగా తెలుసుకుంటానని చెప్పిందట.
దాంతో ఆ అబ్బాయికి ఒళ్లు మండిపోయింది. ఆమెను తిట్టేసాడు. అయినా ఆ అమ్మాయలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక ఏం చేయాలో తెలీక ఎంతో కాలంగా కలిసున్న అమ్మాయితో విడిపోవాలా వద్దా అని నెటిజన్స్‌ని అడుగుతున్నాడు. ఈ పోస్ట్ చదివిన నెటిజన్లు అంతా వదిలేయడమే మంచిదని అలాంటి వాళ్లు రేపు మనల్నే చంపి తిన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని సలహాలు ఇస్తున్నారు. (girlfriend)