అమ్మవారి నగలు విడిపించిన ముస్లిం వ్యక్తి
ఇది కదా మన భారతదేశ గొప్పతనం.. ఇది కదా మతసామరస్యం. తాకట్టులో ఉన్న అమ్మవారి (goddess) నగలను ఓ ముస్లిం వ్యక్తి విడిపించిన ఘటన ఒడిశాలోని కట్టక్ నగరంలో చోటుచేసుకుంది. సుతాహట్ అనే ప్రాంతంలో ఏటా అమ్మవారికి నవరాత్రుల సమయంలో ఘనంగా పూజలు నిర్వహిస్తారు. సుతాహట్ ప్రాంతంలో దుర్గాదేవి కోసం అని ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటుచేసారు.
అయితే కమిటీని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఏటా అమ్మవారికి నవరాత్రుల సమయంలో వేసే నగలను తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు. ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో అమ్మవారికి నగలు అవసరం కాబట్టి సుతాహట్ ప్రాంతానికి చెందిన లియాకుద్దీన్ అహ్మద్ అనే వ్యక్తి రూ.50,000 ఇచ్చి నగలను విడిపించాడు. ఈ అమ్మవారి కమిటీలో అహ్మద్ కూడా ఒక సభ్యుడే. తమకు మతాలు, దేవుళ్ల విషయంలో ఎలాంటి విభేదాలు లేవని.. అంతా సోదరులుగా ఆత్మీయంగా ఉంటామని అహ్మద్ తెలిపారు. (odisha)