Mumbai: ఒకేసారి మలేరియా, డెంగూ.. బాలుడు మృతి
ఓ బాలుడికి ఒకేసారి మలేరియా, డెంగూ, లెప్టో జ్వరాలు రావడంతో అతను చనిపోయిన ఘటన ముంబైలో (mumbai) చోటుచేసుకుంది. ఆగస్ట్ మొదటివారంలో ఆ బాలుడికి జ్వరం వచ్చింది. అతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఓ నాటు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ తర్వాత జ్వరం తీవ్రం కావడంతో ఇక లాభం లేదని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ టెస్ట్‌లన్నీ చేయగా.. ఒకేసారి డెంగూ, మలేరియా, లెప్టోస్పైరోసిస్ అనే జ్వరాలు ఉన్నట్లు తేలింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో పెద్ద హాస్పిటల్‌కు షిఫ్ట్ చేసారు.
చికిత్స సమయంలో ఊపిరితిత్తుల్లో నీరు చేరింది. కిడ్నీల్లో క్రియాటినైన్ లెవెల్స్ ఎక్కువ అయిపోయాయి. మెల్లిగా ఒక్కో అవయవయం ఫెయిల్ అవడంతో ఆ బాలుడు నిన్న మరణించాడు. ఒకేసారి ఇన్ని రకాల జ్వరాలు సాధారణంగా రావని.. కానీ దురదృష్టవశాత్తు ఈ బాలుడి విషయంలో అది జరిగిందని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. (mumbai) జ్వరంగా అనిపించిన మొదటివారంలోనే హాస్పిటల్‌కు వెళ్లి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని తెలిపారు. ముంబైలో ఆగస్ట్ నెలలో డెంగూ, మలేరియా కేసులు ఎక్కవయ్యాయి. ఒక్క ఆగస్ట్‌లోనే 959 మలేరియా కేసులు, 265 లెప్టోస్పైరోసిస్ కేసులు నమోదైనట్లు బృహన్ ముంబై కార్పొరేషన్ (bmc) వెల్లడించింది.