ఆడిషన్‌కి పిలిచి.. నటిపై అత్యాచారం
Mumbai: బాలీవుడ్‌లో ది కపిల్ శర్మ షోకి మామూలు క్రేజ్ లేదు. కమెడియన్ కపిల్ శర్మ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కపిల్ శర్మ షోలో అవకాశం కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. దీనిని అదనుగా చూసుకుని ఓ క్యాస్టింగ్ డైరెక్టర్.. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నటిపై అత్యాచారం చేసాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.
ఆనంద్ సింగ్ అనే వ్యక్తి 26 ఏళ్ల నటిని కపిల్ శర్మ షోకి ఆడిషన్ ఇవ్వడానికి తన ఆఫీస్‌కి రావాలని పిలిచాడు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఆ నటి గంపెడు ఆశలతో అతని ఆఫీస్‌కి వెళ్లింది. ఆ అమ్మాయి అతని కార్యాలయానికి వెళ్లిన తర్వాత తన కోరిక తీరుస్తేనే అవకాశం ఇప్పిస్తానని.. తాను చెప్పినట్లు చేస్తే ఆడిషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని అన్నాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో బలవంతం చేసాడు. ఈ విషయం పోలీసులకు చెప్తే కెరీర్ లేకుండా చేస్తానని బెదిరించాడు. కానీ ఆ అమ్మాయి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాద చేయగా నిందితుడు ఆనంద్ సింగ్‌ను అరెస్ట్ చేసారు.