Mukesh Ambani: కోడలొచ్చింది.. కోట్లు తెచ్చింది..!
Mukesh Ambani: కొత్త కోడలు వచ్చిన వేళా విశేషాన.. రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీకి కోట్లలో లాభం వచ్చింది. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్‌ల వివాహం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అలా ఇంట్లోకి కొత్త కోడలు అడుగుపెట్టగానే.. ముఖేష్ అంబానీకి 3 బిలియన్ డాలర్ల లాభం వచ్చింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.25 వేల కోట్లు. జులై 5 నాటికి ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ 118 బిలియన్ డాలర్లు. జులై 12 నాటికి ఆ విలువ 121 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్‌బర్గ్ బిలియనేర్ ఇండెక్స్ రిపోర్ట్ బయటపెట్టింది. ఇన్ని కోట్ల లాభం ఎలా వచ్చిందంటే.. పెళ్లి రోజున రిలయన్స్ షేర్లు 1 శాతం పెరిగాయి. గడిచిన నెల రోజుల్లో రిలయన్స్ షేర్లు 6.65% పెరిగాయి.