Mukesh Ambani: భారత తొలి బోయింగ్ విమానం అంబానీ సొంతం
Mukesh Ambani: రిలయన్స్ సంస్థల యజమాని ముఖేష్ అంబానీ భారతదేశంలోని తొలి బోయింగ్ విమానాన్ని సొంతం చేసుకున్నారు. భారత్ తొలి బోయింగ్ 737 MAX 9, ఇప్పుడు అంబానీ సొంతం. ఈ బోయింగ్‌కి అంతగా ఉన్న ప్రత్యేకత ఏంటి? 2023 ఏప్రిల్‌లో స్విట్జర్లాండ్‌లోని ఫెసిలిటీ సెంటర్‌లో తనకు నచ్చినట్లుగా కావాల్సిన సౌకర్యాలతో అంబానీ దీనిని తయారుచేయించుకున్నారు. ఇండియాకు తీసుకురావడానికి ముందు బసెల్, జెనీవా, లండన్‌లలో ఆరుసార్లు టెస్టింగ్ చేసారు. చివరికి 6,200 కిలోమీటర్లు ప్రయాణించి ఆగస్ట్ 27న ఢిల్లీ చేరుకుంది. ఈ బోయింగ్‌కి రెండు అడ్వాన్స్‌డ్ ఇంజిన్లు ఉన్నాయి. ఒకేసారి 11,770 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ బోయింగ్ ఖరీదు రూ.1000 కోట్లు. కానీ అంబానీ తనకు నచ్చినట్లు డిజైన్ చేయించుకున్నారు కాబట్టి అంతకంటే ఎక్కువ డబ్బు పెట్టే దీనిని కొనుగోలు చేసారు. అంబానీ దగ్గర బొంబార్డియర్ గ్లోబల్ 6000, రెండు డస్సాల్ట్ ఫాల్కన్ 900s ఎంబ్రేయర్ ERJ-135 జెట్స్ కూడా ఉన్నాయి.