Crime News: బిడ్డకు విషమిచ్చి.. తానూ ఆత్మహత్య చేసుకుని..
Crime News: కరీంనగర్లోని బొమ్మకల్లో దారుణం చోటుచేసుకుంది. శ్రీజ అనే మహిళ కుటుంబ కలహాలతో ఏడాది వయస్సున్న కొడుకుకు విషమిచ్చి తానూ కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తల్లీ బిడ్డ మృతిచెందడంతో ఆ బాధను భరించలేక శ్రీజ తల్లి జయప్రద కూడా విషం తాగింది. దాంతో ఆమెను చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు.