సెక్స్‌కి ఒప్పుకోలేద‌ని కోడ‌లిపై బ్లేడ్‌తో దాడి చేసిన‌ అత్త‌

mother in law attacks daughter in law with blade because she refused sexual advances

 

Viral News: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. త‌న శృంగార వాంఛ‌లు తీర్చ‌లేద‌ని కోడలిపై అత్త బ్లేడ్‌తో దాడి చేసింది. ఘాజిపూర్ జిల్లాకు చెందిన అలోక్ ఉపాధ్యాయ్ అనే వ్య‌క్తిని అదే ప్రాంతానికి చెందిన యువ‌తి 2022లో వివాహం చేసుకుంది. పెళ్లైన నెల రోజుల‌కే అత్తింట్లో కోడ‌లికి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.

ఆడ‌ప‌డుచు ఆ మ‌హిళ‌ను ఓ గ‌దిలో బంధించి రోజూ నెల రోజుల పాటు ఒకే దుస్తులతో ఉంచింది. ఆమె దుస్తుల‌న్నీ ఆడ‌ప‌డుచు వేసుకునేద‌ట‌. 2023లో బిడ్డ పుట్టాక టార్చ‌ర్ మ‌రీ ఎక్కువైంది. క‌ట్నం కావాల‌ని వేధించేవారు. ఆ త‌ర్వాత మ‌హిళ‌ తండ్రి చూడ‌టానికి ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు త‌న బాధ‌లు చెప్పుకుంది. దాంతో త‌న కూతురి బాధ‌లు చూడ‌లేక ఆగ్రాలోని త‌న ఇంటికి తీసుకెళ్లాడు. ఆ త‌ర్వాత త‌మ త‌ప్పు తెలుసుకున్నామ‌ని రాజీప‌డ‌దామ‌ని అత్తింటివారు మ‌ళ్లీ వ‌చ్చారు. వారి మాట‌లు న‌మ్మి ఆ మ‌హిళ అత్తింటికి వెళ్లింది.

ఈ నేప‌థ్యంలో నిన్న రాత్రి కోడ‌లిపై అత్త రెచ్చిపోయింది. త‌న లైంగిక కోరిక‌లు తీర్చాల‌ని కోరింది. ఇందుకు కోడ‌లు ఒప్పుకోక‌పోవడంతో బ్లేడ్‌తో దాడి చేసింది. దాంతో కోడ‌లు ఇంట్లో నుంచి పారిపోయి నేరుగా పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లింది. ముందు పోలీసులు ర‌క్త‌మోడుతున్న బాధితురాలిని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లి ప్ర‌థ‌మ చికిత్స చేయించారు. ఆ త‌ర్వాత ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.