Yadadri: మైనర్ కొడుకు కొట్టాడని తల్లి ఆత్మహత్య
Yadadri: యాదాద్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మోత్కూరుకు చెందిన రేఖ(38) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. రేఖ కుమారుడు(17) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దాంతో ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. చెడు వ్యసనాలు మాని బాగా చదువుకోవాలని తల్లి మందలించడంతో కోపోద్రేకుడై తల్లిపై చేయి చేసుకున్నాడు. మనస్తాపానికి గురైన తల్లి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.