Goldy Brar: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్ట‌ర్ దారుణ హ‌త్య‌

Goldy Brar:  ఇండియాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్ట‌ర్ అయిన గోల్డీ బ్రార్ ఎట్ట‌కేల‌కు దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. కాలిఫోర్నియాలో నివ‌సిస్తున్న గోల్డీని అత‌ని శ‌త్రువు అయిన ల‌ఖ్‌బీర్ గ్యాంగ్ మాటు వేసి వ‌రుస కాల్పుల‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌నలో గోల్డీ బ్రార్ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందిన‌ట్లు స‌మాచారం. పంజాబ్‌కి చెందిన ప్ర‌ముఖ గాయ‌కుడు సిధూ మూసేవాలాను దారుణంగా చంపించింది ఈ గోల్డీ బ్రారే. అప్ప‌టి నుంచి ఇంట‌ర్ పోల్ అధికారులు ఇత‌ని కోసం గాలింపులు చేప‌డుతున్నారు. గోల్డీ బ్రార్ కెన‌డాలోని టాప్ 25 మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్ట‌ర్ల‌లో ఒక‌రు. ఇత‌ను ఇన్నాళ్లూ కెన‌డాలోనే ఉన్నాడ‌ని చాలా మంది అనుకున్నారు కానీ కాలిఫోర్నియాకు మ‌కాం మార్చిన‌ట్లు తేలింది.