Karnataka Ministers: కోటీశ్వరులు.. క్రిమినల్ కేసులు..!
Bengaluru: ఇటీవల కొత్త కర్ణాటక ప్రభుత్వం(karnataka ministers) ఏర్పడింది. సిద్ధారామయ్య(siddaramaiah), డీకే శివకుమార్‌లతో(dk shivakumar) పాటు 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసారు. అయితే ఆ మంత్రుల గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటికి వస్తున్నాయి. వాటిని ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రీఫార్మ్స్) బయటపెట్టింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో లభ్యమైన మంత్రుల అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ సర్వే చేపట్టింది. తొమ్మిది మంది మంత్రుల అఫిడవిట్లను పరిశీలించగా.. తొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిసింది. అందులోని నలుగురు మంత్రులపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంతేకాదు.. ఈ తొమ్మి మంది మంత్రులు కోటీశ్వరులు. ఒక్కొక్కరి వద్ద రూ.229.27 కోట్లు ఉన్నట్లు తెలిసింది. వీరిలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(dk shivakumar) రిచెస్ట్ పర్సన్. ఇతని వద్ద రూ.1,413.80 కోట్లు ఉన్నాయి.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే (mallikarjun kharge) కుమారుడు ప్రియాంక్ ఖర్గే(priyank kharge) వద్ద మాత్రమే తక్కువ ఆస్తులు ఉన్నట్లు తేలింది. చిత్తాపూర్ నియోజకవర్గ ఎమ్మల్యే అయిన ప్రియాంక్ ఖర్గే వద్ద కేవలం రూ.16.83 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక మంత్రుల విద్య వివరాలకు వస్తే.. ముగ్గురు మంత్రులు 8 నుంచి 12వ తరగతి వరకు చదివారు. మిగతా వారు గ్రాడ్యుయేషన్, ఆపై చదువులు చదివారు. కర్ణాటక కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేకపోవడం బాధాకరం.