బాలికను రేప్ నుంచి కాపాడిన కోతుల మూక
Monkey: ఓ ఆరేళ్ల బాలిక అత్యాచారానికి గురవుతున్న సమయంలో స్వయంగా ఆంజనేయస్వామే ప్రత్యక్షమై బాలికను రక్షించాడేమో అనిపించే ఘటన చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని భాగ్‌పట్ నగరానికి చెందిన యూకేజీ చదువుతున్న బాలికను ఓ గుర్తుతెలియని వ్యక్తి చాకెట్లు కొనిపెడతానని ఓ ఇంట్లోకి తీసుకెళ్లాడట. అక్కడికి వెళ్లాక బాలిక దుస్తులు విప్పి అత్యాచారం చేయబోతుండగా కొన్ని కోతుల మూక అతనిపై ఉన్నట్టుండి దాడికి దిగాయి.
దాంతో భయపడి అతను పారిపోయాడు. ఆ తర్వాత పాప ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది. దాంతో పాప తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరా పరిశీలించగా… బాలిక ఆడుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి చాక్లెట్లు ఇస్తానని చెప్పి తీసుకెళ్తున్న దృశ్యం కనిపించింది. ఆ తర్వాత పాపను ఓ వీధిలోకి తీసుకెళ్తుండగా.. పాప ఇంటికి వెళ్తానని గోల చేయడం.. తనతో పాటు రాకపోతే వాళ్ల అమ్మను చంపేస్తానని బెదిరించడం వంటివి చేసాడట. సమయానికి ఆ వానరాలే రాకపోయి ఉంటే తమ బిడ్డ పరిస్థితి తలుచుకుంటేనే గుండె ఆగినంత పని అవుతోందని ఆ తల్లిదండ్రులు వాపోయారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలింపులు చేపడుతున్నారు.