మంచి ఆటగాడు.. మంచి భర్త, మంచి తండ్రి కూడా అయ్యుంటే బాగుండు
Mohammed Shami: మొన్న ఇండియా వర్సెస్ న్యూజిల్యాండ్ మ్యాచ్‌లో (ind vs nz) మహ్మద్ షమీ మెరుపులు తర్వాతి వరల్డ్ కప్ వరకు మరిచిపోలేరు. తన బౌలింగ్ స్టైల్‌లో న్యూజిల్యాండ్‌ని మట్టికరిపించి ఇండియాను ఫైనల్స్‌కి తీసుకెళ్లాడు. ఇప్పుడు అంతా అతనికి బ్రహ్మరథం పడుతున్నారు. షమీ ఆటతీరుపై అతని మాజీ భార్య హసీన్ జహాన్ (hasin jahan) స్పందించారు. మహ్మద్ షమీ మంచి ఆటగాడే కానీ మంచి భర్త, మంచి తండ్రి అనిపించుకుని ఉంటే ఇంకా బాగుండు అని అన్నారు. 2018లో తన భార్య తనపై గృహ హింస కింద తప్పుడు కేసు బనాయించిందని ఆమెతో విడిపోయాడు షమీ.