Mitchell Marsh: గెలుపు అల‌వాటైతే బ‌లుపు ఇలాగే ఉంట‌ది

Mitchell Marsh: ఎవ‌రి వృత్తి వారికి దైవంతో స‌మానం. ఆ వృత్తిలో ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరుకుని అవార్డులు రివార్డులు తీసుకుంటూ ఉంటే ఎంతో గ‌ర్వంగా ఉంటుంది. నిన్న ఇండియా ఆస్ట్రేలియా (ind vs aus) మ‌ధ్య జ‌రిగిన ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్‌లో వర‌ల్డ్ క‌ప్ ఆస్ట్రేలియా వ‌శ‌మైంది.

ప్ర‌పంచ క‌ప్ మ‌న చేతుల్లో ఉండి ఉంటే నెత్తిన పెట్టుకుని ఊరేగుతాం. కానీ ఇప్ప‌టికే ఆరు సార్లు ప్ర‌పంచ క‌ప్ గెలిచిన ఆస్ట్రేలియా ఆట‌గాడు మిషెల్ మార్ష్‌కు వ‌ర‌ల్డ్ క‌ప్ అనేది ఓ ఆట వ‌స్తువు అయిపోయిన‌ట్లుంది. ప్ర‌పంచ క‌ప్‌పై కాళ్లు పెట్టి మ‌రీ ఫోటోల‌కు పోజ్ ఇచ్చాడు. ఈ ఫోటోను ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ (pat cummins) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది. గెలుపు అల‌వాటైతే బ‌లుపు ఇలాగే ఉంటుంద‌ని కొంద‌రు.. ప్ర‌పంచ క‌ప్ అనేది కేవ‌లం ఒక వస్తువు కాదు అదొక ఎమోష‌న్ దానిని గౌర‌వించాలి అంటూ మ‌రికొంద‌రు క్లాస్ పీకుతున్నారు.