Study In US: స్టూడెంట్ వీసాకు ద‌ర‌ఖాస్తు చేస్తున్నారా? ఈ త‌ప్పులు అస్స‌లు చేయ‌కండి

mistakes to avoid when applying for a US student visa

Study In US: అమెరికాలో ఉన్నత చ‌దువులు చ‌దువుకోవాల‌ని క‌ల‌లు క‌నే విద్యార్థులు ఎంద‌రో ఉంటారు. అక్క‌డ చ‌దువుకుంటున్న వారిలో భార‌త‌దేశానికి చెందిన యువ‌తే ఎక్కువ‌. ఒక‌వేళ మీరు విద్యార్థి అయితే.. మీరు కూడా అమెరికా స్టూడెంట్ వీసాకు అప్లై చేస్తున్న‌ట్లైతే.. ఈ తప్పులు లేకుండా చూసుకోండి.

ఇవి గుర్తుంచుకోండి

వీసా ఇంట‌ర్వ్యూల‌కు వెళ్లినప్పుడు అధికారుల మూడ్‌ని బ‌ట్టి మీకు వీసా వ‌స్తుందా రాదా అనేది ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌రికొంద‌రు అధికారులైతే మీరు చెప్పే స‌మాధానాల‌ను బ‌ట్టి వీసాలు జారీ చేయ‌డ‌మో ర‌ద్దు చేయ‌డ‌మో వంటివి చేస్తుంటారు.

మీ గ్రాడ్యుయేష‌న్ త‌ర్వాత కూడా అమెరికాలో ఉంటారా అని అడిగే అవ‌కాశం ఉంది. వారు అడిగితే అలాంటిదేమీ లేదు అని చెప్పండి. అడ‌గ‌క‌పోతే మీకు మీరే చెప్ప‌డం వంటివి చేసి లేనిపోని త‌ల‌నొప్పిలు తెచ్చుకోవ‌ద్దు. ఎందుకంటే F-1 లాంటి స్టూడెంట్ వీసాల‌ను విద్యార్థులు అమెరికాలో చ‌దువుకున్నాక తిరిగి స్వ‌దేశాల‌కు చేరుకుంటార‌న్న ఉద్దేశంతోనే ఇస్తారు.

అమెరికాలో చ‌దువుకోవ‌డానికి వెళ్లే ముందు మ‌న భార‌తీయ జాబ్ మార్కెట్ ఎలా ఉందో కూడా కాస్త అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి. కొన్నిసార్లు ఇలాంటి ప్ర‌శ్న‌లు కూడా అడుగుతారు. కాబ‌ట్టి ఎంతో కొంత నాలెడ్జ్ అవ‌స‌రం. ఒక‌వేళ మీకు భార‌త‌దేశంలో జాబ్ మార్కెట్ గురించి ఎలాంటి అవ‌గాహ‌న లేక‌పోతే.. మీరు చ‌దువు త‌ర్వాత కూడా ఉద్యోగం పేరుతో అమెరికాలోనే ఉండిపోతారేమో అనే సందేహం వీసా అధికారుల‌కు క‌లుగుతుంది. వారికి ఆ డౌట్ వ‌చ్చిందంటే మీ వీసా క్యాన్సిల్ అవుతుంది.

దాదాపు మీ బంధువులంతా అమెరికాలోనే ఉన్నారనుకోండి.. ఈ విష‌యాన్ని వీసా అధికారికి చెప్ప‌ద్దు. వారికి తెలిసిందంటే.. మీరు కూడా వారితో సెటిల్ అయిపోవ‌డానికి స్ట‌డీ వీసా సాకుతో వెళ్తున్నార‌ని అనుకుంటారు.

వీసా ఇంట‌ర్వ్యూకి కావాల్సిన అన్ని ప‌త్రాలు నీట్‌గా ఎరేంజ్ చేసుకుని వెళ్లండి. ఎలా ప‌డితే అలా తీసుకెళ్లారంటే అక్క‌డే మీ వీసా ర‌ద్దు అవుతుంది.

కాస్త ఇంట‌ర్వ్యూకి ప్రిపేర్ అయ్యి వెళ్లాలి. మీరు చెప్పే స‌మాధానం ప‌ర్ఫెక్ట్‌గా లేక‌పోయినా ఫ‌ర్వాలేదు. కానీ మీరు అమెరికాలో చ‌దువు ప‌ట్ల ఆ త‌ర్వాత కెరీర్ ప‌ట్ల సీరియ‌స్‌గా ఉన్నారా లేదా అని మీ స‌మాధానాల‌ను బ‌ట్టే వారు వీసా ఇవ్వాలా వ‌ద్దా అనేది డిసైడ్ చేస్తారు.

ఒక్కోసారి వీసా అధికారులు అడిగిన ప్ర‌శ్న‌ల‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ అటు తిప్పి ఇటు తిప్పి అడుగుతుంటారు. మీరు చెప్పిన స‌మాధానాల‌నే మ‌ళ్లీ చెప్పండి. క‌న్‌ఫ్యూజ్ అయ్యి ముందు ఒక‌లా త‌ర్వాత ఒక‌లా చెప్తే వీసా క్యాన్సిల్ అవుతుంది.

ఈ వీసాల గురించి తెలిసుండాలి

విద్యార్థుల‌కు ఇచ్చే స్ట‌డీ వీసాలు రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి F-1 మ‌రొక‌టి J-1. F-1 వీసా అనేది ఇత‌ర దేశాల నుంచి అమెరికాలోని కాలేజ్‌లు, యూనివ‌ర్సిటీల్లో వివిధ కోర్సుల‌ను చ‌దువుకునేందుకు వెళ్లాల‌నుకునేవారికి ఇస్తారు. J-1 వీసా అనేది అమెరికాలోని స్కూల్స్, కాలేజెస్, యూనివ‌ర్సిటీల్లో జ‌రిగే ప్రోగ్రామ్‌ల‌కు అటెండ్ ఇవ్వడానికి ఇచ్చే విజిట‌ర్ వీసా లాంటిది. ఇది విద్యార్థుల‌కే కాకుండా ప‌రిశోధ‌కులు, స్కాల‌ర్‌షిప్ ఉన్న‌వారికి కూడా ఇస్తారు. ఈ రెండు వీసాల గురించి అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి. లేదంటే వీసా ర‌ద్దు అవుతుంది.