Miss Vizag Nakshatra: నా మొగుడు దాంతో పడుకున్నాడు.. పోలీసులు నాపై కేసు పెడతారట
“” గత ప్రభుత్వంలో ఉన్న పోలీసులు నెల రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు మా వారు మరో యువతితో ఉన్నారని నాకు సమాచారం అందింది. అందుకే నేను పోలీసులు మీడియాను తీసుకుని వెళ్లాను. అక్కడికి వెళ్లి చూస్తే నా భర్త ఆ అమ్మాయితో పడుకుని ఉన్నాడు. పైగా ఆ అమ్మాయే తన భార్య అన్నాడు. ఆ తర్వాత తామిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అన్నాడు. మీడియా ముందే ఐదుసార్లు మాట మార్చాడు. ఇక్కడ అన్యాయం జరిగింది నాకు. ఈ విషయం నేను పోలీసులకు చెప్తే ఆ అమ్మాయికి పెద్దవాళ్లతో పరిచయాలు ఉన్నాయని తిరిగి నాపైనే మర్డర్ కేసు పెడతామని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. హోంమంత్రి అనిత గారు ఆడపిల్లలపై చెయ్యి వేయాలంటే భయపడాలి అని చెప్పిన మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఈ ప్రభుత్వంలో అయినా నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను “” అని తెలిపారు.