తల్లిదండ్రుల ఆహారంలో డ్రగ్స్ కలిపి పెళ్లికి ముందు ప్రియుడితో మైనర్ జంప్
Viral News: ఆ బాలికకు మూడు రోజుల్లో పెళ్లి. కానీ వేరే వాడిని ప్రేమించడంతో ఇంట్లో నుంచి పారిపోవాలనుకుంది. ప్లాన్ ప్రకారం తానే వంట చేస్తానని చెప్పి ఏకంగా తినే ఆహారంలో డ్రగ్స్ కలిపి రాత్రికి రాత్రి జంప్ అయిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలిక రెండు రోజుల క్రితం రాత్రి ఆలూ పరోటాలు చేసింది. అందులో ప్లాన్ ప్రకారం డ్రగ్స్ కలిపింది. తాను తినకుండా తన తల్లిదండ్రులకు తినిపించింది. వారు నిద్రలోకి జారుకోగానే ప్రియుడితో కలిసి పారిపోయింది.
ఉదయం లేచి చూసేసరికి ఇల్లంతా చిందర వందరగా ఉంది. అమ్మాయి కనిపించకపోవడంతో వారికి మత్తు వదిలిపోయింది. ఇంట్లో పెళ్లికి దాచుకున్న లక్ష రూపాయలు, నగలు కూడా మిస్సయ్యాయి. కూతురి ప్రేమ విషయం తెలిసి ఆ యువకుడి ఇంటికి వెళ్లి ఆరాతీసారు. అక్కడ అబ్బాయి కూడా కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో గాలింపులు చేపడుతున్నారు.