యంగ్‌గా కనిపించేందుకు రోజుకు 111 ట్యాబ్లెట్స్..!
పై ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసారా? చూడటానికి ఏదో రబ్బర్ బొమ్మలా ఉన్నాడు కానీ ఇతను అమెరికాకు చెందిన కోటీశ్వరుడు బ్రయన్ జాన్సన్ (bryan johnson). జాన్సన్ యవ్వనంగా (young) కనిపించేందుకు ఒకటి కాదు రెండు కాదు రోజుకు ఏకంగా 111 ట్యాబ్లెట్స్ వేసుకుంటాడట. ఇందుకోసం ఏడాదికి ఏకంగా 2 మిలియన్ డాలర్లు ఖర్చుపెడుతున్నాడు. రోజూ తన ఆరోగ్యం ఎలా ఉందో పరీక్షించుకునేందుకు సొంతంగా ఎన్నో పరికరాలు కొనుగోలు చేసాడు. రోజూ నిద్రపోయే ముందు ఆ పరికరాలను శరీరానికి తగిలించుకుని పడుకుంటాడు. ఇప్పుడు ఇతని వయసు 46. కానీ ఇతని అవయవాలు మాత్రం 18 ఏళ్ల వయసు వారికి ఎలా ఉంటాయో అలా మారిపోవాలనేదే ఇతని లక్ష్యం. ఇతను డిన్నర్ సమయానికి తినే ఆహారాన్ని ఉదయం 11 గంటలకే తినేస్తుంటాడు. (young)
జాన్సన్‌కి 30 ఏళ్ల ఉన్నప్పుడే తన కంపెనీని ఈబే సంస్థకు 800 మిలియన్ డాలర్లను అమ్మేసాడు. ఇతని వద్ద ఎలక్ట్రిక్ ఆడి కారు ఉంది. దానిని ఎంత నిదానంగా నడుపుతాడంటే.. ఓసారి తోటి ప్రయాణికులు కారు ఆపి ఏమైనా సమస్య ఉందా కారుకి అని అడిగారట. వేగంగా వెళ్తే ఎక్కడ తన అవయవాల పనితీరు మారిపోతుందోనని ఇలా నిదానంగా కారు డ్రైవ్ చేస్తాడట. ఇప్పటికే జాన్సన్ తన కొడుకు రక్తాన్ని ఎక్కించుకుంటూ ఉంటాడు. ఇతని దగ్గర రెడీగా 30 మంది డాక్టర్లు ఉంటారు. ఇతని ఆస్తి ప్రస్తుతం 400 మిలియన్ డాలర్లు ఉంటుంది. (young)