Microsoft: విండోస్ 10కి గుడ్ బై
Microsoft: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. విండోస్ 10కు (windows 10) స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపు 240 మిలియన్ కంప్యూటర్లపై ఈ ప్రభావం పడనుంది. 2025 వరకు మాత్రమే మైక్రోసాఫ్ట్ విండోస్ 10కి సెక్యూరిటీ అప్డేట్లను ఇవ్వగలుగుతుంది. ఆ తర్వాత విండోస్ 10 పూర్తిగా తొలగింపబడుతుంది. కాకపోతే సెక్యూరిటీ అప్డేట్లతో విండోస్ 10 వాడుకోవాలంటే యూజర్లు వార్షిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ ఫీజు ఎంత ఉంటుంది అనే అంశాన్ని మైక్రోసాఫ్ట్ వెల్లడించలేదు.
విండోస్ 10 ఆగిపోవడం వల్ల 240 మిలియన్ కంప్యూటర్లు ఎందుకూ పనికిరాకుండాపోతాయి. ఇక వాటిని చెత్తలోనే పడేయాల్సిన పరిస్థితి. దీని వల్ల దాదాపు 480 మిలియన్ కిలోల చెత్త పేరుకుపోతుందని క్యానలిస్ నివేదిక వెల్లడించింది. 480 మిలియన్ కిలోల చెత్త అంటే దాదాపు3,20,000 కార్లతో సమానం.