Meme Dog Chimtu చ‌నిపోయింది

మీమ్స్‌లో బాగా ఫేమ‌స్ అయిన కుక్క చీమ్స్ (meme dog chimtu) అలియాస్ చింటు చ‌నిపోయింది. కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఈ శునకం ఈరోజు చ‌నిపోయింద‌ట‌. దాంతో మీమ‌ర్స్ రెస్ట్ ఇన్ పీస్ చింటూ అంటూ సంతాపం తెలుపుతున్నారు. మీమ‌ర్స్‌కి ఈ కుక్క చాలా కంటెంట్ ఇచ్చింద‌నే చెప్పాలి. మీమ్ భాష‌లో కుక్క‌కు చింటు అనే పేరుతో బోలెడు మీమ్స్ ఉన్నాయి. ఈ మీమ్ డాగ్ బ్రీడ్ పేరు షిబా ఇను. దీనికి ఓన‌ర్లు క‌బోసు అని పేరు పెట్టారు. దీని వ‌ల్ల మిలియ‌న్ మీమ్స్ జ‌న‌రేట్ అయ్యాయి. 2022లో దీనికి లివ‌ర్ స‌మ‌స్య‌లు, లుకేమియాతో బాధ‌ప‌డుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇలాంటి ప్రాణాంత‌క వ్యాధులు వ‌స్తే ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కుక్క‌లు త‌ట్టుకోలేవు. క‌బోసు మ‌ర‌ణంతో దాని ఓన‌ర్లు ఎంతో బాధ‌ప‌డుతున్నారు. త‌మ‌కు ఇలాంటి మ‌రో కుక్క వ‌ద్ద‌ని క‌బోసు మెమొరీస్‌తోనే బ‌తికేస్తామ‌ని అంటున్నారు.