ప‌దేళ్ల చిన్న‌వాడితో ఓయోకి వెళ్లి.. శవంలా మారి..

married woman killed by lover in oyo

oyo: ఓ వివాహిత భ‌ర్త నుంచి విడిపోయి త‌న కంటే వ‌య‌సు ప‌దేళ్లు చిన్న‌వాడైన వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. చివ‌రికి అత‌ని చేతుల్లోనే బ‌లైంది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. ప్ర‌యాగ్‌రాజ్‌కి చెందిన దేవి అనే యువ‌తికి ప‌దేళ్ల క్రితం పెళ్లైంది. భ‌ర్త‌తో గొడ‌వ‌లు ఉండ‌డంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ గ్యాప్‌లో త‌న కంటే వ‌య‌సులో ప‌దేళ్లు చిన్న‌వాడైన వివేక్ కుమార్ అనే యువ‌కుడితో సంబంధం పెట్టుకుంది. నిన్న వీరిద్ద‌రూ స్థానిక ఓయో హోట‌ల్‌కి వెళ్లారు. అక్క‌డ వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ చోటుచేసుకుంది. రూ.5 లక్ష‌లు ఇస్తే స‌రి లేదంటే రేప్ చేసావ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాను అని దేవి వివేక్‌ను బెదిరించింది. ఆమె మోసం భ‌రించ‌లేక‌పోయిన వివేక్ ఆమెను అదే రూంలో చంపేసాడు. ఆ త‌ర్వాత నేరుగా పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయాడు.