Mark Zuckerberg: ఓయబ్బో నీకే ఉందిలే భార్య..!
Mark Zuckerberg: ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కి తన భార్య ప్రిసిల్లా అంటే ఎంత ఇష్టమో ప్రపంచానికి తెలియజేసేందుకు ఓ నిర్ణయాన్ని తీసుకున్నాడు. అమెరికాలోని తన అతిపెద్ద నివాసంలోని గార్డెన్‌లో ఏకంగా భార్య విగ్రహాన్ని ఏర్పాటుచేయించేసాడు. న్యూయార్క్‌కి చెందిన ప్రముఖ కళాకారుడు డేనియల్ అర్షమ్ ఈ విగ్రహాన్ని రూపొందించాడు. మార్క్ జుకర్‌బర్గ్‌ల వివాహం జరిగి 12 ఏళ్లు అవుతోంది.
వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. హార్వడ్ యూనివర్సిటీలో 2003లో వీరిద్దరూ ఓ పార్టీలో కలిసారు. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే భార్య కోసం ఏకంగా తన నివాసంలోనే పెద్ద విగ్రహం ఏర్పాటుచేయించడంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఓయబ్బో.. నీకే ఉందిలే భార్య అంటుంటే.. మరికొందరేమో ఇలాంటి భర్తలు ఎక్కడ దొరుకుతారో చెప్తారా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.