Manipur Hearing: CJIకి కోపం తెప్పించిన అడ్వొకేట్
Delhi: మణిపూర్‌లో ఇద్దరు కుకి జాతికి చెందిన మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుకు సంబంధించిన సుప్రీంకోర్టులో (manipur hearing) వాదనలు జరుగుతున్నాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ (dy chnadrachud) ఆధ్వర్యంలో వాదనలు జరుగుతున్నాయి. కేసును వాదిస్తున్న అడ్వొకేట్ బాన్సురి స్వరాజ్.. మణిపూర్ ఘటన గురించి వాదిస్తూ వెస్ట్ బెంగాల్‌లో మహిళలపై జరుగుతున్న ఘోరాల గురించి వివరించారు. “” మణిపూర్ కంటే ముందు వెస్ట్ బెంగాల్‌లో ఓ యువతిని 40 మంది నగ్నంగా ఊరేగించారు. ఇలా ఛత్తీస్‌గడ్‌లోనూ జరిగింది “” అని బాన్సురి అన్నారు.
దీనిపై చంద్రచూడ్ స్పందిస్తూ.. “” వేరే ఎక్కడో జరిగింది కాబట్టి మణిపూర్‌లో కూడా మహిళల పట్ల అన్యాయం జరిగింది అని సమర్ధించుకోవడానికి వీల్లేదు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతం మణిపూర్ గురించి మాట్లాడుకుందాం “” అని క్లాస్ పీకారు. అయినా కూడా బాన్సురి అదే పాయింట్ పట్టుకుని లాగారు. దాంతో చంద్రచూడ్‌కి కోపం కట్టలు తెంచుకుంది. దాంతో ఆయన బాన్సురిని మందలిస్తూ.. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే అందరు ఆడబిడ్డల్ని కాపాడాలి. లేదా ఎవ్వరినీ కాపాడకూడదు అని చెప్తున్నారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
మహిళా బాధితులు కోర్టుకు మరో విన్నపం చేసారు. తమ కేసును CBIకి అప్పగించకూడదని అన్నారు. దీనికి చంద్రచూడ్ స్పందిస్తూ.. “”ఈ కేసును రాష్ట్ర పోలీసులకు ఇవ్వడం వేస్ట్. ఎందుకంటే ఆ మహిళలను నిందితులకు అప్పగించింది పోలీసులే. కాబట్టి స్పెషల్ ఇన్‌వెస్టిగేషన్ టీంకి అప్పగిస్తున్నాం “” అని తెలిపారు. వాదనలు వినిపిస్తున్న సమయంలో మే 4న నగ్నంగా ఊరేగించిన ఘటన జరిగితే.. పోలీసులు మే 14న ఎందుకు FIR నమోదు చేసారని ఈ సందర్భంగా చంద్రచూడ్ ప్రశ్నించారు. మణిపూర్ కేసుపై వాదనలు రేపటికి వాయిదా వేసారు. (manipur hearing)