Manipur: నీ కూతురు ప్రాణాల‌తో కావాలా? శవంగా కావాలా?

Manipur: మ‌ణిపూర్ అల్ల‌ర్ల‌కు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇటీవ‌ల ఓ మ‌హిళ‌ను (manipur) న‌గ్నంగా న‌డిరోడ్డుపై ఊరేగించిన వీడియో దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత మ‌రో ఇద్దరు యువ‌తుల్ని, ఓ మ‌హిళ‌ను స‌జీవ‌ద‌హ‌నం చేసారు. మ‌ణిపూర్‌లోని మైతీ (meitei), కుకీ (kuki) వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల మ‌ధ్య‌ దాదాపు రెండు నెల‌లుగా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. త‌మ‌ను ఎస్సీలుగా ప‌రిగ‌ణించాల‌ని మైతీ వ‌ర్గం వారు డిమాండ్ చేస్తూ అల్ల‌ర్ల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో రెండు రోజుల క్రితం ఓ మ‌హిళకు ఫోన్ కాల్ వ‌చ్చింది. నీకు నీ కూతురు ప్రాణాల‌తో కావాలా? శ‌వంగా కావాలా? అని అడిగి పెట్టేసార‌ట‌. దాంతో ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.

పోలీసులు ఆ యువ‌తి కోసం గాలింపులు చేప‌డుతుండ‌గా ఆ మ‌రుస‌టి రోజు ఇద్ద‌రు యువ‌తుల్ని న‌గ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ఆ యువ‌తుల్లో ఈమె కూతురు కూడా ఉంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు త‌న కూతురి మృత‌దేహం కూడా ఇంటికి రాలేద‌ని వాపోయింది. యువ‌తి తండ్రి బాధ‌తో అనారోగ్యానికి గుర‌య్యాడ‌ని, ఆయ‌న హాస్పిట‌ల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడ‌ని బాధిత మ‌హిళ తెలిపింది. త‌న కూతురు చ‌నిపోయింద‌ని పోలీసులు చెప్తున్న‌ప్ప‌టికీ ఎప్ప‌టికైనా త‌న కూతురు ఇంటికి వస్తుంద‌న్న ఆశ‌తో ఎదురుచూస్తున్న‌ట్లు ఆ మ‌హిళ విల‌పిస్తోంది. (manipur)