Interview: లేట్‌గా వచ్చిన బాస్.. కోపంతో వెళ్లిపోయిన ఉద్యోగి
Hyderabad: ఉద్యోగాల కోసం ఎంతో మంది చాలా కష్టపడుతుంటారు. ఎండ, వాన అనేవి చూడకుండా గంటల కొద్ది లైన్లలో నిలబడి వెయిట్ చేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తనను ఇంటర్వ్యూ చేయబోయే బాస్ 15 నిమిషాలు లేట్‌గా వచ్చాడని కోపంతో వెళ్లిపోయాడు. (interview) ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ ఆ వ్యక్తి రెడిట్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని పోస్ట్ చేసాడు.
ఇంటర్వ్యూ కోసం ఓ కంపెనీకి వెళ్లిన ఆ వ్యక్తికి రిసెప్షనిస్ట్ మధ్యాహ్నం 2.30కి బాస్ క్యాబిన్లోకి వెళ్లచ్చు అని చెప్పిందట. సరే అని ఆ వ్యక్తి రిసెప్షన్లో వెయిట్ చేసాడు. సరిగ్గా 2.30 గంటలకు లోపలికి వెళ్లచ్చా అని అడిగాడట. కాసేపు ఆగండి బాస్ వస్తారు అని సమాధానం చెప్పిందట. కానీ ఆ బాస్ 15 నిమిషాలు లేట్‌గా వచ్చాడట. దాంతో ఆ వ్యక్తి ఇంటర్వ్యూ ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. (interview)
అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా ఆ వ్యక్తి చెప్పాడు. “” ఇలాంటి కంపెనీల గురించి నాకు బాగా తెలుసు. ఇంటర్వ్యూలకు పిలుస్తారు. గంటలు గంటలు వెయిట్ చేయిస్తారు. ఈ ఉద్యోగం కోసం అతను ఎంత సేపు వెయిట్ చేయగలడు అని టెస్ట్ చేయడానికే ఇలా చేస్తారు. ఇలా ఏ కంపెనీ అయినా చేసిందంటే అది రెడ్ ఫ్లాగ్ అని గుర్తుపెట్టుకోండి. టైం సెన్స్ లేని కంపెనీలు, ఇలా ఇంటర్వ్యూలకు వచ్చిన వారి ఓపికను పరీక్షించే కంపెనీల్లో పనిచేయడం వేస్ట్. ఎందుకంటే మనం ఎంత సేపు ఆ కంపెనీలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తామో వాళ్లు మనల్ని సెలెక్ట్ చేసాక అంతే చిన్నచూపు చూస్తారు. పైగా వీడు ఎన్ని తిట్టినా పడి ఉంటాడులే అని మర్యాద కూడా ఇవ్వరు “” అని వివరించాడు. (interview)