అవ‌య‌వ దానానికి ముందు లేచిన శవం

man wakes up just before organ donation

Viral News: ఓ మ‌నిషి చ‌నిపోయాడ‌నుకుని అవ‌య‌వ దానానికి వైద్యులు సిద్ధ‌మ‌య్యారు. శ‌రీరంపై క‌త్తి గాటు ప‌డ‌బోతుండ‌గా.. ఆ వ్య‌క్తి ఉన్న‌ట్టుండి క‌దిలాడు. దాంతో వైద్యులు, సిబ్బందికి గుండె ఆగినంతప‌నైంది. ఈ ఘ‌ట‌న అమెరికాలోని కెంట‌కీ ప్రాంతంలో చోటుచేసుకుంది. థామ‌స్ అనే వ్య‌క్తికి డ్ర‌గ్స్ ఓవ‌ర్ డోస్ అయిపోవడంతో అత‌ను బ్రెయిన్ డెడ్ అయిన‌ట్లు వైద్యులు తెలిపారు. దాంతో అత‌ను కోరుకున్న‌ట్లే అవ‌య‌వ దానం చేసేందుకు కుటుంబీకులు కూడా ఆమోదం తెలిపారు.

అవ‌య‌వ దాన ప్ర‌క్రియ మొద‌ల‌వడానికి కొన్ని క్షణాల ముందు థామ‌స్ ఉన్న‌ట్టుండి క‌దిలాడు. దాంతో వైద్యులు షాక‌య్యారు. కాసేప‌టికే అత‌ను క‌ళ్లు తెరిచి ఏడ‌వ‌డం మొద‌లుపెట్టాడు. వైద్యులు అవ‌య‌వ దాన ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్టేసి ఉంటే థామ‌స్ చ‌నిపోయేవాడే. అయితే.. థామ‌స్ విష‌యంలో హాస్పిట‌ల్‌లోని వైద్యులు అత‌ను ఇక లేవ‌కుండా ఉండేందుకు మ‌త్తు ఇంజెక్ష‌న్లు ఇచ్చి అవ‌య‌వ దాన ప్ర‌క్రియను చేయ‌బోయార‌ని ప‌లువురు సిబ్బంది ఆరోపించారు. ఇలాంటి నీచ‌మైన హాస్పిట‌ల్‌లో ఇక తాము ప‌నిచేయం అంటూ రాజీనామా చేసారు. ఆ షాక్ నుంచి తేరుకునేందుకు మ‌రికొంద‌రు సిబ్బంది థెర‌పీ కూడా తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. విష‌యం థామ‌స్ కుటుంబీకుల‌కు తెలీడంతో వారు ఆ హాస్పిట‌ల్‌పై కేసు పెట్టారు.