యువ‌తిని రేప్ చేసి.. పెళ్లి వేడుక నుంచి కిడ్నాప్ చేయ‌బోయి..

man tries to kidnap woman whom he raped

 

Viral News: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఒళ్లు గ‌గుర్పొడిచే ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ వ్య‌క్తి యువ‌తిపై అత్యాచారం చేయ‌డ‌మే కాకుండా.. ఆమెను పెళ్లి వేడుక నుంచి కిడ్నాప్ చేయ‌బోయాడు. ప‌ట్ట ప‌గ‌లే క‌త్తితో వీరంగం సృష్టించిన ఆ యువ‌కుడిని చూసి ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. స్థానిక అశోక్ న‌గ‌ర్ ప్రాంతానికి చెందిన స‌లీమ్ ఖాన్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన యువ‌తిపై మోజుతో అత్యాచారం చేసాడు. ఈ నేప‌థ్యంలో త‌ల్లిదండ్రులు ఆమెకు మ‌రో వ్య‌క్తితో పెళ్లి ఫిక్స్ చేసారు.

ఈ విష‌యం తెలుసుకున్న స‌లీమ్ ఖాన్ త‌న స్నేహితుల‌తో క‌లిసి క‌త్తులు, ఇనుప రాడ్ల‌తో యువ‌తి ఇంటిపై దాడి చేసాడు. ఆమె తల్లిదండ్రుల్ని సోద‌రుడిని దారుణంగా కొట్టి యువ‌తిని కాళ్లు ప‌ట్టుకుని బ‌య‌టికి ఈడ్చుకెళ్లాడు. ఆమె కేక‌లు వేయ‌డంతో స్థానికులు చుట్టుముట్టారు. ఎక్కువ మంది గుమిగూడ‌టంతో మ‌రో పెళ్లి ఎలా చేసుకుంటావో నేనూ చూస్తా అని వార్నింగ్ ఇచ్చి అక్క‌డి నుంచి పారిపోయాడు.