భార్యతో వేగలేక.. గుండు చేయించుకుని జంప్ అయిన భర్త
Viral News: భార్య టార్చర్ తట్టుకోలేక ఓ వ్యక్తి గుండు చేయించుకుని పరారయ్యాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. ఉత్తర కర్ణాటకకు చెందిన ఓ టెకీకి భార్య, 8 నెలల పాప ఉన్నారు. అయితే రెండు రోజుల క్రితం ఆ టెకీ ఇంట్లో నుంచి పారిపోయాడు. దాంతో అతని భార్య పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. దాంతో పోలీసులు ఆ టెకీ వాడిన సిమ్ కార్డు ఆధారంగా ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నించారు. సీసీటీవీ కెమెరాల్లో కూడా ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది ఎక్కడా కనిపించలేదు.
ఆ తర్వాత నోయిడా నుంచి ఆ టెకీ కొత్త సిమ్ కార్డు వేయడంతో పోలీసులకు అతని ఆచూకీ తెలిసింది. అలా ముగ్గురు పోలీసులు ఆ టెకీ కోసం నోయిడా వెళ్లి ఓ షాపింగ్ మాల్లో పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ టెకీ తన బాధను పోలీసులకు చెప్పుకున్నాడు. “” నా భార్య రోజూ తిడుతోంది సార్. కొంచెం అన్నం కింద పడినా, చపాతీ ముక్క పడినా నోటికొచ్చినట్లు తిడుతుంది. నేను ఏ దుస్తులు వేసుకోవాలో కూడా ఆమె డిసైడ్ చేస్తుంది. చాయ్ తాగడానికి బయటికి వెళ్లాలన్నా ఆమె పర్మిషన్ తీసుకోవాలి. నేను తట్టుకోలేకపోతున్నాను సర్. అందుకే నన్ను ఎవ్వరూ గుర్తుపట్టకుండా గుండు చేయించుకుని తిరుగుతున్నాడు “” అని తెలిపాడు. దాంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపాడు.