Lottery గురించి లీక్ చేసిన భార్య.. కేసు వేసిన భర్త
Lottery: ఆడదాని నోట్లో ఆవ గింజ నానదు అంటారు. అందుకే ఆడవారి దగ్గర కొన్ని విషయాలను దాస్తుంటారు. తెలిసో తెలీకో అందరికీ చెప్పేస్తారని. అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి ఇదే అనుభవం ఎదురైంది. దాంతో అతను తన భార్యపై కేసు వేయాల్సి వచ్చింది. అమెరికాలోని మెయిన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అమెరికాలోనే నాలుగో అతిపెద్ద లాటరీ అందింది.
దాదాపు 1.35 బిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలిసింది. అయితే అప్పటికే అతను తన భార్యతో విడిపోయాడు. లాటరీ వచ్చిందన్న విషయం ఎవ్వరికీ చెప్పద్దు అని తన మాజీ భార్యతో చెప్పాడు. ఆమె చేత కూడా సంతకం చేయించాడు. అయితే ఆమె అతని తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పేసింది. దాంతో ఇంట్లో వారందరికీ విషయం తెలిసిపోయింది. వారు కూడా మాకు కూడా డబ్బులు కావాలని అడుగుతున్నారు. దాంతో ఎవ్వరికీ చెప్పను అని సంతకం చేసిన తర్వాత కూడా మోసం చేసిందని ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులు ఇక చెల్లవని ఆ వ్యక్తి కేసు వేసాడు. ప్రస్తుతం ఈ కేసును అమెరికాలోని ఓ కోర్టు పరిశీలిస్తోంది.