జైలు తప్పిదం.. ఖైదీకి పరిహారం..!
ఓ జైలు చేసిన తప్పిదానికి ఖైదీ అదనంగా మూడేళ్లు జైల్లో ఉండాల్సి వచ్చింది. దాంతో గుజరాత్ కోర్టు (gujarat) అతని రూ.లక్ష పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అసలు ఏం జరిగిందంటే.. చందన్ అనే వ్యక్తి 2020లో మర్డర్ కేసులో జైలుకి వెళ్లాడు. అయితే సరైన సాక్ష్యాలు ఇంకా దొరకనందున 2020 సెప్టెంబర్‌లో అతనికి బెయిల్ మంజూరు అయ్యింది. బెయిల్‌కు సంబంధించిన లెటర్‌ను అతని లాయర్లు జైలు అధికారులకు మెయిల్ ద్వారా పంపారు. కానీ ఎవ్వరూ కూడా ఆ మెయిల్ చూసుకోలేదు.
కనీసం ఆ లాయర్ కానీ చందన్ తరఫు కుటుంబీకులు కానీ పట్టించుకోలేదు. అలా ఆ బెయిల్‌కి సంబంధించిన మెయిల్ ఎవ్వరూ చూడకపోవడంతో చందన్ జైల్లోనే ఉండిపోయాడు. ఇటీవల అతను మరోసారి బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడంతో విషయం బయటపడింది. జైలు అధికారులు మెయిల్ చూడకపోవడం వల్లే అతను జైల్లో ఉండిపోవాల్సి వచ్చిందని వారు అతనికి 15 రోజుల్లోగా రూ.1 లక్ష పరిహారంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.