Sikkim: అమానుషం.. అమ్మమ్మపై అత్యాచారం
Sikkim: సిక్కిం రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల యువకుడు 80 ఏళ్ల అమ్మమ్మపై అత్యాచారం చేసాడు. వివరాల్లోకెళితే.. బాధితురాలు తన కొడుకు కోడలితో కలిసి నివసిస్తోంది. ఈ నేపథ్యంలో వారు పని మీద వెస్ట్ బెంగాల్ వెళ్లిన నేపథ్యంలో ఆమెను పక్కింట్లో వదిలి వెళ్లారు. ఆ సమయంలో బాధితురాలు పక్కింటి వాళ్లకు తన మనవడు తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడని చెప్పింది. అది విని వారు షాకయ్యారు. వెంటనే ఈ విషయాన్ని బాధితురాలి కొడుకు కోడలితో చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో బాధితులు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఆశ్రయించగా.. బాధితురాలి నుంచి రాతపూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నారు. నిందితుడికి వ్యతిరేకంగా తల్లిదండ్రులే ఫిర్యాదు చేయడంతో కేసు మరింత స్ట్రాంగ్‌గా మారింది. వాదోపవాదాలు విన్న సిక్కిం హైకోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు జరిమానా విధించింది.