భ‌ర్త‌తో గొడ‌వ ప‌డిన మ‌హిళ‌ను ఓదార్చి.. ఆపై అత్యాచారం

man rapes a woman after she had a fight with her husband

Viral News: ఓ మ‌హిళ త‌న భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డింద‌ని తెలిసి అదే అద‌నుగా చూసి ఆమెపై అత్యాచారం చేసాడు ఓ వ్య‌క్తి. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. గ్వాలియ‌ర్ జిల్లాకు చెందిన ఓ 27 ఏళ్ల యువ‌తి త‌న భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డింది. వారు గొడ‌వ‌ప‌డ‌టం చూసిన స‌త్యేంద‌ర్ అనే ప‌క్కింటి వ్య‌క్తి ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాల‌ని అనుకున్నాడు. గొడ‌వ ప‌డిన రోజు ఆ యువ‌తి త‌న సోద‌రి ఇంటికి వెళ్లింది. ఈ విష‌యం తెలుసుకున్న స‌త్యేంద‌ర్ ఆమె సోద‌రి ఇంటికి వెళ్లాడు. నేను మిమ్మ‌ల్ని ఎంతో కాలంగా ఇష్ట‌ప‌డుతున్నా.

మీరు మీ భ‌ర్త‌తో సంతోషంగా లేరు. అలాంటివాడు మీకు అవ‌స‌రమా? మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని న‌మ్మ‌బ‌లికి త‌న‌తో పాటు ఇంటికి తీసుకెళ్లాడు. ఆ యువ‌తి స‌త్యేంద‌ర్ మాట‌లు న‌మ్మి ఇంట్లోకి వెళ్ల‌గానే ఓ గ‌దిలో బంధించి దాదాపు 15 రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేసాడు. ఆ త‌ర్వాత ఎలాగో అలా ఆమె త‌ప్పించుకుని నేరుగా పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి జ‌రిగిన సంఘ‌ట‌న‌ను వివ‌రించ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. నిందితుడు స‌త్యేంద‌ర్‌తో పాటు యువ‌తి భ‌ర్త‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.