ప్రయాణికురాలి వక్షోజాలు నలిపి.. హస్తప్రయోగం చేసుకుంటూ
Flight: ఎతిహాద్ విమానంలో ఓ భారతీయుడు చేసిన కీచక పనికి ఓ యువతి వణికిపోయింది. మళ్లీ ఆ అమ్మాయి విమానాల్లో ప్రయాణిస్తుందో లేదో అనే ప్రశ్న తలెత్తింది. వివరాల్లోకెళితే.. కృష్ణ అనే ప్రయాణికుడు వారం రోజుల క్రితం అబు దాబి నుంచి బోస్టన్‌కు ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కి చెందిన EY7 విమానంలో ప్రయాణించాడు. ఆ రోజు విమానంలో ప్రయాణికులు చాలా తక్కువగా ఉన్నారు. కృష్ణ వెనకున్న రెండు సీట్ల అవతల ఓ అమ్మాయి ఒంటరిగా కూర్చుని ఉంది. తన పక్కన రెండు సీట్లు ఖాళీగానే ఉన్నాయి. దాంతో కృష్ణ బాత్రూమ్‌కి వెళ్లాలి కాస్త అవతలి సీటులో కూర్చుంటారా అని అడిగాడు. ఆమె సరే అని పక్క సీటులోకి జరిగి కూర్చుంది. అదే అదనుగా చూసిన కృష్ణ ఆమెను ముట్టుకుంటూ నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా అని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. తనకు విషయం అర్థమైపోయింది. దాంతో ఆ అమ్మాయి వైఫై రావడంలేదు అని సాకు చెప్పి ఎయిర్ హోస్టెస్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది.
ఆమె వెంటే వెళ్లిన కృష్ణ మళ్లీ ఆమెపై చేతులు వేస్తూ ఆమె ప్రైవేట్ భాగాలను తాకాడు. దూరంగా ఉండు అని ఆమె అరవడం విని ఓ ఎయిర్ హోస్టస్ వచ్చి చూసింది. వెంటనే అతన్ని వేరే సీటులో కూర్చోపెట్టింది. అదే సమయంలో ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు తీసిన కృష్ణ వేరే సీటులో కూర్చోపెట్టినప్పటికీ దుప్పటి కప్పుకుని హస్త ప్రయోగం చేసుకోవడం మొదలుపెట్టాడు. అది చూసిన మరో ప్యాసెంజర్ వెంటనే ఫిర్యాదు చేసాడు. దాంతో అతనిపై బోస్టన్ విమానాశ్రయ పోలీసులకు సమాచారం అందించారు. విమానం బోస్టన్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వగానే కృష్ణను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతని కేసు విచారణలో ఉంది.