పెళ్లి కూతురు దొరక్క.. మానెక్విన్‌తో వివాహం
Marriage: పాపం పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయీ దొరక్కపోవడంతో చివరికి మానెక్విన్ (షోరూంలలోని బొమ్మ)ను వివాహం చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లి కొడుకు గెటప్‌లో వచ్చిన ఆ యువకుడు పూల మాల తీసుకుని ఆ బొమ్మ మెడలో వేసాడు. ఏదో పెళ్లాన్ని ముద్దాడినట్లు కౌగిలించుకుని ముద్దు పెట్టి ఆ బొమ్మను తనతో పాటు ఎత్తుకపోయాడు. ఆ సమయంలో స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. మరో విషయం ఏంటంటే.. ఆ అబ్బాయి ఆ బొమ్మ ఉన్న షాప్ యజమానిని కూడా బొమ్మను తీసుకుపోతానని వేడుకున్నాడట. అందుకు ఆ యజమాని కూడా ఒప్పుకోవడం కొసమెరుపు. అయితే.. ఈ రోజుల్లో పాపులర్ అవడానికి చాలా వికృత పనులకు పాల్పడుతున్నారు. ఈ ఘటన కూడా అలాంటి పనుల్లో ఒకటే అని కూడా అనుకోవచ్చు.