Swiggy నుంచి మెసేజ్‌.. రూ.38,000 మాయం!

Swiggy: హ‌లో స‌ర్.. మీ ఆర్డ‌ర్ వ‌చ్చేసింది. ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి అని వ‌చ్చిన మెసేజ్‌పై క్లిక్ చేసిన పాపానికి ఓ వ్య‌క్తి రూ.38,000 పోగొట్టుకున్నాడు. ఈ ఆన్‌లైన్ మోసం బెంగ‌ళూరులో చోటుచేసుకుంది. చెన్న‌కేశ‌వ అనే వ్య‌క్తికి నిన్న స్విగ్గీ నుంచి ఒక మెసేజ్ వ‌చ్చింది. స‌ర్ మీరు రూ.5000 విలువైన ఆర్డ‌ర్ పెట్టారు.

క‌న్ఫామ్ చేకాబ‌ట్టి ఇలాంటి లింక్‌లు మీకు వ‌చ్చిన‌ప్పుడు కాస్త ఆలోచించి వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది.య‌డానికి లింక్ క్లిక్ చేయండి అని ఆ మెసేజ్‌లో రాసుంది. నేనెప్పుడు పెట్టాన‌బ్బా అని లింక్ క్లిక్ చేయ‌గానే లేజీపే లోన్ యాప్ నుంచి చెన్న‌కేశ‌వ రూ.38,000 వాడుకున్న‌ట్లు డ‌బ్బు డెబిట్ అయింది. అంటే ఇప్పుడు ఆ డ‌బ్బును చెన్న‌కేశ‌వ తీర్చాల‌న్న‌మాట‌. ఇలాంటి స్కాంలపై సైబ‌ర్ సెక్యూరిటీ అధికారులు కూడా ఏమీ చేయ‌లేక‌పోతున్నారు. కాబ‌ట్టి.. ఒక్క‌సారి డ‌బ్బు పోయిందంటే ఇక తిరిగి రాద‌నే అనుకోవాలి.