కంటిపై వాలిన ఈగ.. కన్ను తొలగించిన వైద్యులు
Viral News: ఓ వ్యక్తి కంటిపై ఈగ వాగలడంతో దాదాపు అతను కంటి చూపునే కోల్పోయాడు. వైద్యులు ఒక కంటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. చైనాకు చెందిన వూ అనే వ్యక్తి ఏదో పనిలో ఉండగా.. ఒక ఈగ మాటిమాటికీ అతని ముఖంపై వాలుతూ విసిగిస్తోంది. దాంతో అది కంటిపై వాలగా తన చేత్తో తనే గట్టిగా కొట్టుకున్నాడు. దాంతో ఈగ చచ్చింది. ఈగ చావడంతో పాటు అతని కన్ను దెబ్బతింది. కన్ను ఎర్రగా అయిపోయి వాచిపోయింది. నొప్పిగా ఉండడంతో వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాడు.
పరీక్షలు చేసిన వైద్యులు చచ్చిన ఈగకు సంబంధించినవి కంటికి తగలడంతో లోపల కణాలు దెబ్బతిని ఇన్‌ఫెక్షన్ సోకిందని చెప్పారు. మందులు కూడా ఇచ్చారు. అయితే మందులు వాడుతున్నా కంటి నొప్పి తగ్గలేదు. దాంతో కన్ను తొలగించాల్సి వచ్చింది. తొలగించకపోయి ఉంటే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యేదని వైద్యులు వెల్లడించారు.