విడాకులొద్దంటూ కోర్టులోనే భార్యను ఎత్తుకున్న భర్త
Divorce: విడాకుల కోసం ఓ మహిళ కోర్టును ఆశ్రయించగా.. అక్కడ జరిగిన సంఘటన అందరినీ షాక్‌కి గురిచేసింది. కళ్ల ముందు జరుగుతున్నది నిజమా లేక సినిమా షూటింగా అన్న రేంజ్‌లో జడ్జి షాక్‌లో ఉండిపోయింది. అసలేం జరిగిందంటే.. చైనాకి చెందిన లీ, చెన్ అనే దంపతులు 20 ఏళ్లుగా కాపురం చేస్తున్నారు. అయితే కొన్ని నెలలుగా లీ చెన్‌ను తిడుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్నాడట. దాంతో చెన్ విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ కేసు కోర్టు వాదనలకు రాగా.. లీ తిడుతున్నాడన్న అంశం తప్ప మరే సరైన కారణం లేదంటూ కేసును డిస్మిస్ చేసింది. ఆ తర్వాత లీ, చెన్‌లు ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా లీ ప్రవర్తనలో మార్పు రాకవడంతో చెన్ మళ్లీ కోర్టు మెట్లెక్కింది.
కోర్టులో కేసు విషయమై జడ్జి మాట్లాడుతుండగా.. ఉన్నట్టుండి లీ చెన్‌ను ఎత్తుకుని పారిపోవడానికి యత్నించాడు. దాంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. లీ కేకలు వేయడంతో వెంటనే పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఇంకోసారి ఇలా ప్రవర్తిస్తే జైలు శిక్ష విధిస్తానని జడ్జి వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఇంకెప్పుడూ ఇలా చేయను అని లీ రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు. అయితే లీకి విడాకులు ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో వీరిని కౌన్సిలింగ్‌కు పంపారు.