స‌వ‌తి కూతురితో లైంగిక సంబంధం.. భార్య‌ను చంపేందుకు కోకా కోలా మ‌ర్డ‌ర్ స్కెచ్

man kills wife to marry step daughter

Viral News: స‌వ‌తి కూతురిపై క‌న్నేసాడు. ఏడు ప‌దుల వ‌య‌సులో వావివ‌ర‌స‌లు మ‌రిచి ఆ పిల్ల‌ను పెళ్లి చేసుకోవాల‌నుకున్నాడు. ఇందుకు భార్య అడ్డంగా ఉంద‌ని ఆమెను చంపేందుకు కోకో కోలా ప్లాన్ వేసాడు. అమెరికాకు చెందిన 71 ఏళ్ల ఆల్ఫ్రెడ్ అనే వృద్ధుడి షాకింగ్ స్టోరీ ఇది. 2021లో ఆల్ఫ్రెడ్ ఆల్రెడీ ఓ కూతురు ఉన్న మ‌హిళ‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ మ‌హిళ‌కు పుట్టిన కూతురిపై క‌న్నేసాడు. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాల‌నుకున్నాడు. దీనికి త‌న భార్య అడ్డుగా ఉంద‌ని ఆమెను వదిలించుకోవాల‌ని అనుకున్నాడు.

ఈ నేప‌థ్యంలో త‌న భార్య కోకో కోలా ఎక్కువ‌గా తాగుతుంద‌ని తెలిసి అందులో డ్ర‌గ్స్ క‌లిపేవాడు. అలా ఆమె ఎక్కువగా డ్ర‌గ్స్ ఉన్న‌ కోకో కోలా తాగేసేది. ఆ డ్ర‌గ్స్ ప్ర‌భావం వ‌ల్ల క‌ళ్లు తిర‌గ‌డం, త‌ల‌నొప్పి, విరోచ‌నాలు అవుతుండ‌డంతో ప్ర‌తిసారీ హాస్పిట‌ల్‌లో చేరుతూ ఉండేది. వైద్యులు ఆమెకు ప‌రీక్ష‌లు చేయ‌గా ఆమె డ్ర‌గ్స్ తీసుకుంటోంద‌ని తెలిసింది. అయితే తన‌కు అస‌లు డ్ర‌గ్స్ అల‌వాటే లేద‌ని వైద్యుల‌కు చెప్ప‌డంతో వారికి అనుమానం వ‌చ్చింది. దాంతో ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అలా ఆల్ఫ్రెడ్ చేస్తున్న దారుణం బ‌య‌ట‌ప‌డింది. పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకుని విచార‌ణ చేప‌ట్ట‌గా.. త‌న భార్య కూతుర్ని పెళ్లి చేసుకోవాల‌న్న ఉద్దేశంతో ఆమెకు డ్ర‌గ్స్ ఓవ‌ర్ డోస్ ఇచ్చి చంపేయాల‌ని అనుకున్న‌ట్లు నిజం ఒప్పుకున్నాడు.

అంతేకాదు.. త‌న భార్య కూతురితో త‌న‌కు లైంగిక సంబంధం ఉంద‌ని.. త‌న త‌ల్లిని చంపేస్తే పెళ్లి చేసుకోవ‌చ్చ‌ని ఈ డ్ర‌గ్స్ ఐడియా ఇచ్చింది కూడా ఆ అమ్మాయే అని చెప్ప‌డంతో ఆ క‌న్న‌త‌ల్లి మ‌న‌సు విరిగిపోయింది. దాంతో పోలీసులు ఇద్ద‌రిపై కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేసారు.