Viral News: భార్యను చంపి.. బీమా డబ్బుతో సెక్స్ డాల్ కొనుగోలు చేసి..
Viral News: ఓ వ్యక్తి భార్యను చంపి.. ఆమె మరణం తర్వాత వచ్చిన బీమా డబ్బులతో సెక్స్ డాల్ కొనుగోలు చేసాడు ఓ రాక్షస భర్త. ఈ ఘటన అమెరికాలోని కాన్సాస్‌లో చోటుచేసుకుంది. కాల్బీ అనే వ్యక్తి 2019లో తన భార్యను చంపేసి.. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తన భార్య ఆత్మహత్య చేసుకుందని నమ్మబలికాడు. కాల్బీ చెప్తున్న వివరణకు జరిగిన సంఘటనకు పోలిక లేకపోవడంతో తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.
అయితే.. కాల్బీ భార్య చనిపోయిన మూడు రోజుల తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని పోస్ట్ మార్టెం రిపోర్టులు కూడా చెప్పాయి. దాంతో కాల్బీని పోలీసులు వదిలేసినప్పటికీ వారి స్టైల్‌లో వారు విచారణ చేస్తూనే ఉన్నారు. మర్డర్ జరిగిన రెండేళ్ల తర్వాత కాల్బీ రెండు బీమాలను క్లెయిమ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ బీమా డబ్బుతో దాదాపు 2000 డాలర్లు ఖర్చు పెట్టి సెక్స్ డాల్ కొనుగోలు చేసాడు.
వచ్చిన బీమా డబ్బుతో ఆన్‌లైన్‌లో వీడియో గేమ్స్ కొనుగోలు చేసి.. అప్పులు తీర్చేసి.. సంగీత వాయిద్యాలను కొనుగోలు చేసాడు. అప్పుడు పోలీసులకు అనుమానం వచ్చి కాల్బీని అరెస్ట్ చేయడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. భార్యను చంపేస్తే ఆమె బీమా డబ్బులతో సెక్స్ డాల్ కొనుగోలు చేసి ఎంజాయ్ చేయచ్చు అనుకున్నానని నిజం ఒప్పుకున్నాడు.